Tuesday, December 21, 2010

విద్యార్ధి రత్నాలు - Student Gems



9 వ తరగతి విద్యార్ధి గనిశెట్టి  శివ పెయింట్ ఆర్ట్ పై రూపొందించిన చిత్రమిది. 



వివిధ తరగతుల విద్యార్ధులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.
ఈ చిత్రం లో గనిశెట్టి శివ మరియు కోసూరి సతీష్ ఒక స్కిట్ ప్రదర్శిస్తున్నారు.

గజ్జెల మోనారే 
విద్యార్ధులు గజ్జెల మోనారే అంటూ నృత్యం చేసిన ఈ జానపద పాటను యు ట్యూబ్ లో పెద్ద సంఖ్యలో వీక్షకులు చూస్తున్నారు. పలు  అంతర్జాతీయ సైట్లు ఈ వీడియోను   తమ వీడియోలతో పాటు ప్రదర్శిస్తున్నాయి.  దీన్ని మీరు కూడా చూడాలంటే దయచేసి ఈ క్రింది లింక్ నొక్కండి. 
Students of our school perform GAJJELA MONARE folk dance at an occasion. This video clipping is being watched by the folk lovers throughout world in a large number. If you want to enjoy it please click the link under this caption. 
http://www.youtube.com/watch?v=1G3zeiAASOE
అలరించిన నృత్యం 
వెదురుపర్తి విద్యార్ధులు చేసిన ఈ నృత్యానికి అద్భుత స్పందన లభించింది. వెదురుపర్తి పూర్వపు ఆంగ్ల ఉపాధ్యాయులు కాసా వెంకట శ్రీనివాస రావు డాన్సు మాస్టర్ సురేష్ ద్వారా ఈ నృత్యానికి శిక్షణ ఇప్పించారు. విద్యార్ధుల ప్రతిభను గ్రామస్తులు, ఉపాధ్యాయులూ ప్రశంసించారు.  
ఈ క్రింది లింక్ ను క్లిక్ చేసి ఈ నృత్యాన్ని చూడండి. 
http://www.youtube.com/watch?v=iMLQtkmpfgM

Monday, December 20, 2010

చల్లని తల్లి అన్నమ్మ - ANNAMMA

      వెదురుపర్తి ఉన్నత పాథశాలకు ఒక చల్లని దేవతలా అన్ని సౌకర్యాలూ కల్పిస్తున్నవారు శ్రీమతి అన్నమ్మ. వెదురుపర్తిలో  ఉన్న ఒక ఉన్నత పాఠశాల,  రెండు ప్రాథమిక పాఠశాలలకు   ఆమె రెండున్నర లక్షల రూపాయల విలువైన వివిధ సహాయాలను అందించారు. వెదురుపర్తి ఉన్నత పాఠశాల  ఉపాధ్యాయులూ, విద్యార్ధులూ, గ్రామస్తులూ ఆమెకు ఎప్పుడూ రుణపడి ఉంటారు. ఈ చిత్రం లో అన్నమ్మ గారితో పాటుగా గ్రామ సర్పంచ్ సగరపు సన్యాసి   నాయుడు, ఉపాధ్యాయవేదిక విశాఖ జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి శంకర ప్రసాద్, రేసోర్సు పర్సన్లు కాసా వెంకట శ్రీనివాస్, డబ్బీరు మల్లేశ్వర రావులు ఉన్నారు.

Sunday, December 19, 2010

జన్మ దినోత్సవ కార్యక్రమం - Birthday Programme

మా పాఠశాల  లో అమలవుతున్న  మరో పథకం జన్మదినోత్సవ కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మా పాఠశాల జూనియర్ రెడ్ క్రాస్ విభాగం నిర్వహిస్తుంది. విద్యార్ధుల పుట్టిన రోజులను ప్రకటించి వారికి శుభాకాంక్షలను తెలియజేయడంతో పాటుగా వారికీ చిరు కానుకను అందజేయడం జరుగుతోంది. విద్యార్ధులు ఎంతో  ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని స్వీకరించడంతో ఇది  పాఠశాలలో విజయవంతమైన కార్యక్రమంగా నిర్వహించబడుతోంది.