పోస్ట్ బాక్స్

జూనియర్ రెడ్ క్రాస్ అధ్వర్యంలో పాఠశాల పోస్ట్ బాక్స్ నిర్వహించ బడుతోంది. సాధారణంగా ప్రాథమిక పాఠశాలల్లో నిర్వహించబడే పోస్ట్ బాక్స్ కార్యక్రమం మా ఉన్నత పాఠశాలలో విజయవంతంగా నిర్వహించ బడుతోంది. విద్యార్ధులు వివిధ అంశాలపై ఉపాధ్యాయులకు, సహ విద్యార్థులకూ ఉత్తరాలను రాసి ఈ పోస్ట్ బాక్స్ లో వేస్తుంటారు. వీటిని సంబంధిత వ్యక్తులకు అందించేందుకు పోస్ట్ బాక్స్ టీం కృషి చేస్తోంది.
ఆరోగ్యం జాగ్రత్త!
ప్రసంగిస్తున్న శ్రీ వేలం నూకరాజు
|
పదో తరగతి పరీక్షలకు హాజరౌతున్న విద్యార్ధులు చదువు, ఆరోగ్యం, చేతిరాతల విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితాలను సాధించవచ్చని క్రిస్టల్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్తాపకులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ వేలం నూకరాజు విద్యార్ధులకు పిలుపునిచ్చారు. వెదురుపర్తి ఉన్నత పాఠశాల లో జూనియర్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్వర్యంలో పదో తరగతి విద్యార్ధులకు నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. పలు విషయాలపై విద్యార్ధులకు అయన ఇచ్చిన సలహాలు, సూచనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయిని శ్రీమతి బి. వి.నాగలక్ష్మి, వి.నాగమణి, ఆర్. ఎస్. ప్రసాద రావు, రెడ్ క్రాస్ సొసైటీ కన్వీనర్ మల్లారెడ్డి శంకర ప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
***
మొబైల్ సైన్సు వ్యాన్
మొబైల్ సైన్సు వ్యాన్ తో ఉపాధ్యాయులు
|
విద్యా శాఖ ఆధ్వర్యం లో నడుస్తున్న విశాఖ పట్నం మొబైల్ సైన్సు ల్యాబ్ వెదురుపర్తి హై స్కూల్ ను సందర్శించింది. రిసోర్సు పర్సన్ బి. కే. వి. గోవింద రావు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వెదురుపర్తి హై స్కూల్ విద్యార్ధులు ఈ కార్యక్రమం లో అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ఆలోచించాలని, సైన్సు లక్ష్యాలను గుర్తించాలని ఆయన పిలుపు నిచ్చారు. ప్రశ్నించే గుణాన్ని పెంపొందించుకోవాలని విద్యార్ధులకు సూచించారు. పాథశాల ఉపాధ్యాయులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.
ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోండి
గోవిందరావు మాస్టారి పిలుపు |
విద్యార్ధులు నిత్యజీవితం లో సైన్సు విలువను గుర్తించాలని, ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోవాలని విశాఖ జిల్లా సైన్సు రేసోర్సు పర్సన్ గోవింద రావు పిలుపునిచారు. మూఢ నమ్మకాలూ ఒక తరం నుండి మరో తరానికి వ్యాపిస్తున్నాయని, ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోవడం ద్వారా మాత్రమే వాటిని నివారించగలమని ఆయన పిలుపునిచ్చారు.
***
బాలల దినోత్సవం
జూ. రెడ్ క్రాస్ చిత్రలేఖన పోటీలు
కంప్యూటర్ విద్య
జూ. రెడ్ క్రాస్ రోజూ చేతుల పరిశుభ్రత
గాంధీగిరి బాలలు
వక్తృత్వపు పోటీలు
అంధుల గానలహరి