Monday, March 28, 2011

గేదెక్కడికి పోయింది?

 పాఠశాలపై మమకారం
వెదురుపర్తి ప్రాథమిక పాఠశాల - 2లో విద్యా సంబరాలు లో జరిగిన కార్యక్రమంలో శ్రీమతి ఎ. జానకీదేవి  పాఠశాలప విద్యార్థులకు పుస్తకాల బ్యాగులను పంపిణీ చేసారు. 1984-87లో వెదురుపర్తి ప్రాథమిక  పాఠశాల2లో ఉపాధ్యాయినిగా పనిచేసిన ఆమె  పాఠశాలపై మమకారంతో విద్యార్థులకు ఈ విధమైన సహాయ సహకారాలను అందించడం స్ఫూర్తి కలిగించే విషయమని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి మల్లారెడ్డి శంకర ప్రసాద్ పేర్కొన్నారు.  గ్రామ సర్పంచ్ సగారపు  సన్యాసి నాయుడు, ఉన్నత  పాఠశాల రిటైర్డ్ ఉపాధ్యాయులు శ్రీ సుభ్రమణ్యం,  పాఠశాల ప్రధానోపాధ్యాయిని శ్రీదేవి, రామకృష్ణ, శ్రీనివాసు, అంబేద్కర్, సంయుక్తా రాణి, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వెదురుపర్తి లోని ప్రఖ్యాత రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని వీరు సందర్శించారు. 




 గేదెక్కడికి  పోయింది? 
స్పందించే హృదయం  ఛారిటబుల్  ట్రస్టు అధ్వర్యంలో 
17-2-2013న  మునగపాక ఉన్నత  పాఠశాలలో నిర్వహించిన  
విజ్ఞానోత్సవ్ 2013  కార్యక్రమంలో 
వెదురుపర్తి ఉన్నత పాఠశాల జూనియర్ రెడ్ క్రాస్ బృందం ప్రదర్శించిన గేదేక్కడికి పోయింది నాటిక సభికులను మంత్రముగ్దులను చేసింది.  
   




 రామానుజన్ జన్మ దినోత్సవ సందర్భంగా గణిత ఉపాధ్యాయిని
శ్రీమతి  బి. వి. నాగలక్ష్మిని సన్మానిస్తున్న విద్యార్థులు 

మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా జూనియర్ రెడ్ క్రాస్ ప్రదర్శించిన దెయ్యం నాటికలో ఒక దృశ్యం. 
ఈ నాటిక ప్రేక్షకులను చైత్న్యపరచింది 
******************************************************


జూనియర్ రెడ్ క్రాస్  సంస్కృతిక బృందం ఆధ్వర్యంలో 30-11-12 న ప్రదర్శించిన 'దేవతా వస్త్రాలు' నాటిక విద్యార్ధులను మంత్రముగ్ధులను చేసింది. జూనియర్ రెడ్ క్రాస్ కన్వీనర్ మల్లారెడ్డి శంకర ప్రసాద్ దర్శకత్వంవహించారు. కో- కన్వీనర్ బి.వి. నాగలక్ష్మి విద్యార్ధులను అభినందించారు.  జగదీశ్, సాయి, ప్రవీణ్, దత్తా, భూపతి, మహేష్, నాగ సాయి, భాస్కర్  సాయిలు ఈ నాటికలో అద్భుత  కనబరిచారు 




వెదురుపర్తి లో  దేవీనవరాత్రుల మహోత్సవం









మట్టి బొమ్మల తయారీపై వర్క్ షాప్ 

జూనియర్ రెడ్ క్రాస్ అధ్వర్యంలో వెదురుపర్తి ఉన్నత పాఠశాలలో విద్యార్ధులకు మట్టి బొమ్మల తయారీపై శిక్షణ ఇచ్చారు. ప్రముఖ  విగ్రహాల తయారీ నిపుణులు శివకోటి అప్పారావు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమం పై విద్యార్ధులకు అవగాహన కల్పించారు. జూనియర్ రెడ్ కరాస కన్వీననర్ మల్లారెడ్డి శంకర ప్రసాద్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యయుడు    రామ ప్రసాద్, జూనియర్ రెడ్ క్రాస్  కో - కన్వీనర్
బి.వి.నాగ లక్ష్మి, పాఠశాల సైన్సు  క్లబ్ ప్రతినిధి కే.శేషగిరి ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.
పాఠశాల విద్యార్ధులు ఉపాధ్యాయులు శివకోటి అప్పారావు గారిని ఘనంగా  సన్మానించారు 

మట్టి విగ్రహాల తయారీ నిపుణులు శివకోటి అప్పారావును  సన్మానిస్తున్న ఉపాధ్యాయులు. 
**************************************************************************

వెదురుపర్తి గ్రామంలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా నెలకొల్పిన ఒక వినాయకుడి విగ్రహం. మట్టి వినాయకుల విగ్రహాలనే ఉపయోగించాలన్న పిలుపుకు చిన్న విగ్రహాల నుండి పెద్ద స్పందన,
 పెద్ద విగ్రహాల నుండి చిన్న స్పందన వచ్చింది.
***************************************************************************************************



పర్యావరణ  వినాయక ఉత్సవం 2012
జూనియర్ రెడ్  వెదురుపర్తి ఉన్నత  పాఠశాల మరియు స్పందించే హృదయం సంస్థల ఆధ్వర్యం లో విద్యార్ధులకు పర్యావరణ పరిరక్షణ పై అవగాహనాసదస్సు నిర్వహించారు. వినాయక చవితి ఉత్సవాలలో మట్టి వినాయక విగ్రహాలను మాత్రమె ఉపయోగించాలని పిలుపు నిచ్చారు. పుట్టమన్నుతో తయారయిన విగ్రహాలను విద్యార్ధులకు అందజేసారు. 
జూనియర్ రెడ్ క్రాస్ కన్వీనర్  శంకర ప్రసాద్ ఆధ్యక్షత   వహించిన ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్. ఎస్. రాం ప్రసాద్, రెడ్ క్రాస్ కో కన్వీనర్ బి వి. నాగ లక్ష్మి సైన్సు క్లబ్ ప్రతినిధికె.శేషగిరి, ఉపాధ్యాయులు భాస్కర రావు, పి.ఇ. టి. బి.సత్యవతి తదితరులు  పాల్గొన్నారు. 
*****************************************************
వెదురుపర్తి విద్యార్ధినికి పురస్కారం. 
ఇండియన్ హైకూ క్లబ్ ప్రతిస్తాత్మకంగా నిర్వహించిన విశాఖ జిల్లా స్తాయి శ్రీ బంగారు రాజు పద్య పోటీలలో వెదురుపర్తి విద్యార్థిని శ్యామల ద్వితీయ బహుమతి పొందింది. బహుమతితో పాటు వెయ్యి రూపాయల నగదు పురస్కారాన్ని కూడా అందజేశారు




వెదురుపర్తి లో వైద్య శిబిరం   
వెదురుపర్తి ఉన్నత పాఠశాలలోజూనియర్ రెడ్ క్రాస్ ఆధ్వర్యం లో జరిగిన వైద్య శిబిరం అద్భుతం గా జరిగింది.  300 మందికి  ప్రజలు ఈ శిబిరానికి వచ్చి  వైద్య సేవలను అందుకున్నారు. 


సదస్సు ప్రారంభిస్తూ ప్రసంగిస్తున్న డాక్టర్ యామినీ కుమారి.



వైద్య పరీక్ష  చేస్తున్న డాక్టర్ దివ్య తేజ్ 


వైద్య పరీక్ష  చేస్తున్న డాక్టర్   యామినీ కుమారి. 


వైద్య శిబిరానికి హాజరైన  ప్రజలు.


శిబిరాన్ని నిర్వహించిన జూనియర్ రెడ్ క్రాస్ సభ్యులు 


జ్ఞాపిక అందజేస్తున్న గ్రామ  పెద్దలు 


వైద్యులను అభినందిస్తున్న వెదురుపర్తి  గ్రామ సర్పంచ్  సన్యాసి నాయుడు. 


%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
ఉగాది వేడుకలు  
వెదురుపర్తి ఉన్నత పాఠశాలలో   వేడుకలను జూనియర్ రెడ్ నిర్వహించింది. ప్రత్యేకంగా రూపొందించిన తెలుగుతల్లి చిత్ర పటానికి పూల మాల వేసి ఉగాది పచ్చడి, మిఠాయిల పంపిణీ   అత్యంత ఆనందంగా పండగను జరుపుకున్నారు. 
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

గాలి పటాల పండగ 
వెదురుపర్తి ఉన్నత పాఠశాలలో గాలి పటాల పండగ ఘనంగా జరిగింది. జూనియర్ రెడ్ క్రాస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. 

xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx

విజ్ఞాన ఉత్సవం 


నీటినుండి పెట్రోలు తయారీ ఇంద్రజాలం - బాబాల మాయ జాలం 


ఇంద్రజాల ప్రదర్శనలో లీనమైపోయిన విద్యార్ధులు. 


సారయ్య గారితో పాఠశాల ప్రధానోపాధ్యాయిని B .V . నాగ లక్ష్మి, రెడ్ క్రాస్ కన్వీనర్ మల్లారెడ్డి శంకర ప్రసాద్,
జిల్లా నాస్తిక సంఘం అధ్యక్షులు MSVSP .వర్మ, రెడ్ క్రాస్ కో కన్వీనర్ పిళ్లా రవిశంకర్. 


      భారత నాస్తిక సమాజం, జూనియర్ రెడ్ క్రాస్ సొసైటీలు సంయుక్తంగా వెదురుపర్తి ఉన్నత పాఠశాల లో మూఢ నమ్మకాల నిర్మూలనలో సైన్సు పాత్ర అనే అంశం పై ఇంద్రజాల ప్రదర్శన జరిగింది. రాష్ట్ర సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ వ్యవస్తాపకులు జీడి సారయ్య ఈ ప్రదర్శన నిర్వహించారు. బాబాలు చేసే ఇంద్రజాలాలను వియర్ధులకు ప్రయోగపూర్వకంగా వివరించారు. ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోవాలని, గుడ్డిగా ఏ విషయాన్నీ నమ్మవద్దని సారయ్య విద్యార్ధులకు పిలుపునిచ్చారు.
XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX



రెడ్ క్రాస్ వారోత్సవాలు 2011 

రెడ్ క్రాస్ వారోత్సవాలు ఆగష్టు 7 వ తేదీ నుండి ౧౩వ తేదీ వరకు అత్యంత ఉత్సాహపూరిత వాతావరణం లో జరిగాయి. ప్రముఖ వైద్యులు డాక్టర్ దివ్యతేజ్ ఈ వారోత్సవాలను ప్రారంభించారు.



పర్యావరణాన్నికాపాడుకుందాం. 
విద్యార్ధుల  గీతాలు


xxxxxxxxxxx
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx xxxxxxxxxxx

కౌమార శిక్షణ 
      
విద్యార్ధినీ విద్యార్ధులు కౌమార వయసులో తీసుకోవాల్సిన జాగ్రత్తల పై  జూనియర్ రెడ్ క్రాస్ రిసోర్స్  పర్సన్ శ్రీమతి  సంజీవని  ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని జూనియర్ రెడ్క్రాస్స్ నిర్వహించింది.  పాఠశాల ప్రధానోపాధ్యాయిని బి. వి. నగగాలక్ష్మి, జూనియర్ రెడ్ క్రాస్ కన్వీనర్ మల్లారెడ్డి శంకర ప్రసాద్, కో కన్వీనర్ పిళ్లా రవి శంకర్, సైన్సు క్లబ్ ప్రతినిధి కే.వి శేషగిరి తదితరులు పాల్గొన్నారు. 
                                                                                    
మట్టితో తాయారు చేసిన వినాయక విగ్రహాలతో విద్యార్ధులు.

పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని ఉపాధ్యాయ వేదిక విశాఖ జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి శంకర ప్రసాద్ స్పష్టం  చేసారు. వెదురుపర్తి ఉన్నత పాఠశాలలో జరిగిన మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమంలో అయన మాట్లాడారు. స్పందించే హృదయం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్తాపకులు ASN  మూర్తి అందించిన  మట్టి విగ్రహాలనుపాఠశాలలో పంపిణీ చేసారు. పాఠశాల సైన్సు ఉపాధ్యాయులు శేషగిరి, నాగరాజు, జూనియర్ రెడ్ క్రాస్ కో- కన్వీనర్ రవిశంకర్ తదితరులు పర్యావరణ ప్రాముఖ్యతను, కాలుష్య నివారణను గురించిన అమూల్య విషయాలను విద్యార్ధులకు  వివరించారు.

2 comments:

  1. Nice Content thanks for Sharing
    For latest Gk & Current Affairs and Best website for Any Competitive (Government) Exams Visit Gk Upgrade

    ReplyDelete